ట్రైన్ పట్టాలపై నుజ్జునుజ్జయిన మృతదేహం

పూళ్ల-భీమడోలు రైల్వే స్టేషన్ల మధ్య అండర్పాస్ సమీపంలో రైలు పట్టాలపై శనివారం గుర్తుతెలియని వృద్ధుడి చిద్రమైన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 60-70 ఏళ్ల వయసున్న మృతుడు 5.5 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగుతో, చిరిగిన నలుపు ప్యాంటు ధరించి ఉన్నట్లు రైల్వే ఎస్సై అప్పారావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తెలిసినవారు 9247585733, 8019157528 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్