గురువారం తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం లో 'ఉద్యాన పంటల్లో ప్రధాన తెగుళ్లు, వ్యాధుల నియంత్రణ - జీవనియంత్రణ చర్యలు' అనే అంశంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ కే ధనుంజయ్ రావు మాట్లాడుతూ, రైతులు జీవన ఎరువులు వినియోగిస్తే పెట్టుబడి వ్యయం తగ్గి నాణ్యమైన దిగుబడులు వస్తాయని తెలిపారు. జీవన ఎరువులతో భూసారం కూడా పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.