పెంటపాడులో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో పత్రాలను దహనం చేసి, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు మాట్లాడుతూ, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, శ్రీనిధి, రైతు భరోసా, ఆక్వా రైతులకు సబ్సిడీ వంటి హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.