సామాజిక సేవ, యువజన సాధికారత, నాయకత్వ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (WOSA) వ్యవస్థాపకుడు చిరివెళ్ల సాయి మహంతీర్ ప్రతిష్టాత్మక “ఇండియన్ ఐకాన్ అవార్డు 2026”ను అందుకున్నారు. హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో “ఎక్సెలెన్స్ ఇన్ యూత్ లీడర్షిప్ అండ్ కమ్యూనిటీ సర్వీస్” విభాగంలో ఆయనకు ఈ గౌరవం లభించింది. యువతలో స్ఫూర్తిని నింపుతూ, విద్య, సామాజిక సేవ, నాయకత్వ వికాసం, విద్యార్థుల సంక్షేమం, సమాజాభివృద్ధి కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు.