తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా త్వరలోనే ఎన్యూమరేటర్లను నియమిస్తామని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం మండలం కృష్ణయ్య పాలెం గ్రామంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ, నష్ట అంచనాల నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, తడిచిన, రంగు మారిన, పాడైన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు మిల్లర్లతో చర్చిస్తున్నామని ఆమె వివరించారు.