కూటమి ప్రభుత్వం లో సామాన్యలకు కష్టాలు.. వైసీపీ నేత కట్టా

డీజిల్, పెట్రోల్, గ్యాస్ కొరతతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కట్టా నాగరాజు అన్నారు. ఆటోలు, టాక్సీలు నడిపి జీవనం సాగించే కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం జగన్ పాలనలో కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజల ప్రాణాలను కాపాడి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత జగన్ కే దక్కిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పడం మానుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్