తాడేపల్లిగూడెం మండలం దండగర్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని వీరమళ్ల పద్మశ్రీ నూజివీడు IIITకి ఎంపికైంది. పదవ తరగతిలో 584 మార్కులు సాధించిన పద్మశ్రీ, గతంలో ఇస్రోలో శిక్షణ, NITలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీలో ప్రతిభ కనబరిచింది. ఈ మేరకు HM చంద్రశేఖర్ శనివారం తెలిపారు. IIITకి ఆమె ఎంపిక పట్ల ఆయన అభినందించారు.