టోకెన్ ఉంటేనే డీజిల్ పంపిణీ

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో డీజిల్ కొరత కారణంగా, రైతుల వ్యవసాయ పనుల కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టోకెన్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు రైతులను గుర్తించి, ట్రాక్టర్లకు 30 లీటర్లు, లారీలకు 50 లీటర్ల చొప్పున రోజుకొక టోకెన్ జారీ చేస్తున్నారు. డీజిల్ కొరత తీరే వరకు ఈ విధానం కొనసాగుతుందని వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. బంకుల్లో సమస్యలుంటే వీఆర్ఏలను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్