అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకు లను క్లిక్ చేయవద్దు

తాడేపల్లిగూడెం ఏపీ నిట్ లో బుధవారం సైబర్ జాగరూకత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ (డీపీటీసీ) ఆకుల రఘు మాట్లాడుతూ, ప్రజలు తమ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఆన్ లైన్ లో ఉంచవద్దని హెచ్చరించారు. తెలియని వై ఫై, హాట్ స్పాట్ లను వినియోగించరాదని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకు లను క్లిక్ చేయవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. డీన్ కిషోర్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్