తాడేపల్లిగూడెం ఆటోనగర్ వద్ద ఆగి ఉన్న హైవే పెట్రోలింగ్ షాడో వాహనాన్ని ధాన్యం లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాచర్లకు చెందిన లారీ డ్రైవర్ రాగి పిండి శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.