తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని దర్శించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రదక్షిణ అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు.