సోమవారం పెంటపాడు ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిర్ల పుల్లారెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సిరపరపు రంగారావు, బంకురు నాగేశ్వరరావు డీజిల్ కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారని, డీజిల్ కొరత నిత్యవసరాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ సమావేశంలో పి. దుర్గ కూడా పాల్గొన్నారు.