తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నల్ల ప్రకాష్ అనే వ్యక్తికి ఏజేఎఫ్ సీఎం కోర్టు మెజిస్ట్రేట్ కే. లలిత దేవి రూ. 11 వేల జరిమానా విధించారు. నేరం రుజువు కావడంతో ఈ తీర్పు వెలువడింది. జరిమానా చెల్లించని పక్షంలో నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.