శ్రీశైల క్షేత్ర మహత్యం హరికథతో మంజుల భార్గవికి ఘన సత్కారం

తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన హరికథా భాగవతారిణి మంజుల భార్గవిని శ్రీశైలం దేవస్థానం అధికారులు శనివారం  ఘనంగా సత్కరించారు. శ్రీశైల క్షేత్ర మహత్యం అనే హరికథా గానం ద్వారా క్షేత్ర వైశిష్ట్యాన్ని ప్రచారం చేయడం హర్షణీయమని అధికారులు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం బివిఆర్ కళా కేంద్రంలో జరిగిన ఈ గానామృతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అధికారులు మంజుల భార్గవిని సన్మానించి, ఆమె కళా సేవను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్