వీ. కోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) సెక్రటరీ జనరల్ డి. సోమ సుందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిగూడెంలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, రౌడీ షీటర్ చేతిలో 17 కత్తిపోట్లతో జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారని, ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.