నమ్మి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉండాలన్న పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలో ఉద్యమి సభ్యత్వ సాదక్ లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జన సైనికులంతా ఉత్సాహంగా ఉండాలని, ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మోటార్ సైకిళ్ళు, మొబైల్ ఫోన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు రాజేష్ పాల్గొన్నారు.