జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులతో కళకళలాడింది. ఆలయ అర్చకులు అమ్మవారిని లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం విశేష పూజలు, పంచామృతాభిషేకాలు చేశారు. పంచహారతులను ఇచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.