పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలన ముగియడంతో, తాడేపల్లిగూడెంకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి బుధవారం పాదరక్షలు ధరించారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఆర్జీ కర్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె అన్నారు. మమతా బెనర్జీ పదవి నుంచి దిగిపోయే వరకు పాదరక్షలు ధరించనని శపథం చేసినట్లు ఆదిలక్ష్మి తెలిపారు. ప్రజలు ఆమె పాలనను తిరస్కరించడంతోనే తాను పాదరక్షలు ధరించినట్లు ఆమె పేర్కొన్నారు.