లిఫ్ట్ ఇస్తానని నమ్మించి బోడపాడుకు చెందిన మహిళ మెడలోని గొలుసును దొంగిలించిన కేసులో నిందితుడు జొన్నల వెంకటేశ్‌కు తాడేపల్లిగూడెం మెజిస్ట్రేట్ లలిత దేవి 13 నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. 2017లో జరిగిన ఈ చోరీ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఈ శిక్ష ఖరారైంది. కేసును సమర్థంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేశామని పోలీసులు తెలిపారు.