పేదరిక నిర్మూలన, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన P4 పథకంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు ప్రతి నెలా ఆటో డ్రైవర్లకు రూ. 5000 చొప్పున అందిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా, గురువారం బస్సు స్టాండ్ వద్ద ఉన్న ఫ్రెండ్స్ ఆటో యూనియన్ సభ్యుడు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు భార్య సత్యవేణికి ఎమ్మెల్యే బోలిశెట్టి తన సొంత నిధుల నుండి రూ. 5000 అందజేశారు.