పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ, గతంలో వచ్చిన మొందా తుఫాను వల్ల వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని, మళ్ళీ ఇప్పుడు దిత్వా తుఫాను వల్ల చేతికి వచ్చిన పంటను అమ్ముకోవడానికి కూడా అవకాశం లేక రైతులు 75 కేజీల బస్తాను దళారులకు ₹. 500 తక్కువకు అమ్ముకుంటున్నారని తెలిపారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.