పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ ఉన్నత పాఠశాలకి చెందిన దివ్యాంగ విద్యార్థిని తన్మయి శ్రీదేవి జాతీయ స్థాయి ప్రత్యేక క్రీడా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది. ఛత్తీస్ గఢ్‌లోని బిలాస్ పూర్ లో జులై 24 నుంచి 28 వరకు జరిగిన బేస్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె వ్యక్తిగత విభాగంలో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆమెను, కోచ్ సాయిస్వరూపను బుధవారం గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు సత్కరించారు.