పెంటపాడు మండలం రావిపాడు పేదల కాలనీ వెంకయ్యకాలువ పక్కన ఉంది. ఇక్కడ 120 మందికి స్థలాలు కేటాయించినా, సరైన రహదారి లేకపోవడం, కాలువపై వంతెన లేకపోవడంతో కేవలం 20 మంది మాత్రమే ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. తాత్కాలికంగా బల్లకట్టు వేసినప్పటికీ విద్యార్థులు రోజూ కాలువ దాటడం కష్టంగా మారింది. వెంటనే వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు.