పెంటపాడు మండలంలోని కోరుమిల్లి సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా వల్లూరి సాయి రమేష్, సభ్యులుగా జే. వెంకట సుబ్బారావు, కే. బుల్లిరాజు నియమితులయ్యారు. శనివారం చైర్మన్ సాయి రమేష్ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాబ్జీకి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ ఉదయ భాస్కరరావు, పి. దేవ వరప్రసాద్, చంద్రం పాల్గొన్నారు.