టీడీపీ కార్యాలయంలో పీజీఆర్ఎస్

తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. ప్రజల వద్ద అర్జీలను స్వీకరించి, 20 మంది లబ్ధిదారులకు రూ. 12,23,652 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ప్రతివారం టిడిపి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే సంబంధిత అధికారికి ఇచ్చి పరిష్కరించేలా చూస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్