రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటలు బయటకు రావొద్దు: APSDMA

రాష్ట్రంలోని పలు జిల్లాలకు APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో ప.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్