ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు దాడి

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు దాడి చేసిన ఘటన కాళ్లలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. కాళ్ల (M) బోసు కాలనీకి చెందిన ప్రభుదాస్, గాంధీనగర్‌కు చెందిన పూజిత కొంతకాలంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు ప్రభుదాస్ ఇంటిపై దాడి చేసి పూజితను బలవంతంగా తీసుకువెళ్లారు. తన భార్యను తనకు అప్పగించాలని బాధితుడు కాళ్ల పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత పోస్ట్