తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్సై ప్రసాద్ తన సిబ్బందితో కలిసి బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. 13 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 30,700 క్యాష్, 3 కోడి పుంజులు, 8 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.