తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలో నాలుగు కొత్త బార్ లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ లైసెన్సులు 2026 ఫిబ్రవరి 5 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఆసక్తిగలవారు ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.