తాడేపల్లిగూడెం పట్టణంలో ఏకో ఓవర్సీస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ – 2025ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్య అవకాశాలను పరిచయం చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ఫెయిర్‌లో పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు.