తాడేపల్లిగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తాడేపల్లిగూడెం మండలం పట్టెంపాలెంకి చెందిన రవితేజ (35) గూడెంలోని ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. గురువారం బైకుపై గూడెం వస్తుండగా చినతాడేపల్లి వచ్చేసరికి ముందు వెళ్తున్న ఎరువుల లోడు లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు వెనుక చక్రాల కింద పడి రవితేజ దుర్మరణం చెందాడు. ప్రమాద స్థలాన్ని రూరల్ ఎస్సై ప్రసాద్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్