శారీరక శ్రమతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం 32వ వార్డులో నిర్మిస్తున్న ఓపెన్ ఆడిటోరియం పనులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి ఆయన పరిశీలించారు. క్రీడల ద్వారా ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. క్రీడల అభివృద్ధికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చర్యలను అభినందించారు. జనసేన నాయకులు పాల్గొన్నారు.