తాడేపల్లిగూడెం: శాకంబరీ దేవిగా శ్రీ బలుసులమ్మవారు

తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసులమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా జూలై 11న శాకంబరీగా అలంకరించనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించి ఆశీర్వాదాలు పొందాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆషాఢ మాస సారె బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజి, నీలం సురేశ్, పట్నాల రాంపండు, సుబ్బరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్