నిరుపేదలకు గ్రామలలో 3 సెంట్లు ఇంటి స్థలం అందిస్తామని రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం (M) జగ్గన్నపేట, వెంకటరామన్నగూడెం గ్రామలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు 90% మంది ప్రజలకు అందాయన్నారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.