తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్ సీపీ మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు మండల పార్టీ అధ్యక్షుడు జడ్డు హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఈ సమావేశానికి విచ్చేస్తారని అన్నారు. వైసీపీ పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.