తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం, పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి హాజరయ్యారు. ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.