రెండవ శనివారం సెలవు దినంగా ప్రభుత్వానికి నిబంధనలు ఉన్నప్పటికీ, తాడేపల్లిగూడెం సెంట్ ఆన్స్ విద్యాసంస్థలు పాఠశాలను యథావిధిగా నిర్వహించడాన్ని ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ అడ్డుకుంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి పతివాడ నాగేంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా పాఠశాల నిర్వహణపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం సమాధానంపై అసంతృప్తి తెలిపారు.