కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షాలు

రానున్న 2 గంటల్లో కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని సూచించింది.

సంబంధిత పోస్ట్