తాడేపల్లిగూడెం పట్టణంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా పలుచోట్ల భారీ వృక్షాలు విద్యుత్ తీగలపై విరిగిపడ్డాయి. దీంతో హై టెన్షన్ వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత వారం రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలు వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఉపశమనం పొందారు. విద్యుత్ అధికారులు విరిగిపడిన చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.