ఘనంగా వాసవి మాత జన్మదిన వేడుకలు

తాడేపల్లిగూడెం, ఏలూరు రోడ్డులోని వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వాసవి మాత 4449వ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆలయ అర్చకులు ఆదిత్య శర్మ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో పాటు విఘ్నేశ్వర పూజ, 108 వెండి కలశములతో కలశ పూజ, 108 సువాసినిలతో ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్టుకు పంచామృతాలు, ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు కుంకుమలతో విశేష అభిషేకాలు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు కుంకుమ పూజలు, లలిత సహస్ర పారాయణం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్