అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని శనివారం తణుకులో నిర్వహించారు. ఈ సందర్భంగా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్. ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కాలేజీలో తణుకు మండల న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.