తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన మహనీయుడని కొనియాడారు. తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి, దేశానికి దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ఆయన అన్నారు.