ఈ నెల 3న తణుకులో అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక

అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికలు ఈనెల 3న తణుకు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. అండర్ 14, 16, 18, 20 బాలుర, బాలికల విభాగాల్లో జరుగుతాయని అన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 9 నుండి 11 వరకు చీరాలలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారని తెలిపారు. పూర్తి వివరాలకు 9989363978 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్