అత్తిలి గోగులమ్మ పేట కొత్తకాలనీలో గత 15 ఏళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేఅవుట్ కాకపోవడంతో ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు అవకాశం లేదు. దీంతో స్థానికులు సోమవారం అత్తిలి ఏఎంసీ ఛైర్మన్ దాసం ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించి తన సొంత నిధులు రూ. లక్షతో డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తానని అప్పటికప్పుడు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.