ఎక్సైజ్ అధికారులమని చెప్పి కూల్ డ్రింక్ షాపుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు నకిలీ అధికారులను అత్తిలి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన మల్లాడి శివ, యుద్ధనపూడి వినోద్, సూరవరపు ఉమామహేశ్వరరావు, భూక్యా కృష్ణ కంచుమర్రులో పట్టుబడ్డారు. వీరి నుంచి కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ప్రేమ రాజు తెలిపారు.