కృష్ణా జిల్లాకు చెందిన నలుగురు యువకులు కారులో అత్తిలి మండలం కంచుమర్రుకు వచ్చి, తాము ఎక్సైజ్ పోలీసులమని చెప్పి ఓ కూల్ డ్రింక్స్ షాపుదారుని బెదిరించి బుధవారం రూ.2 వేల మేర వసూలు చేశారు. గుట్కా, మద్యం అమ్ముతున్నావంటూ గొడవ చేశారు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు వచ్చి నలుగురిని అరెస్టు చేసి, కారు స్వాధీనం చేసుకున్నారు.