తణుకు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో బూత్ లెవల్ ఏజెంట్స్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు వైసిపి ఇంచార్జ్ కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, తణుకు వైసిపి పరిశీలకులు కొట్టు నాగు పాల్గొన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తయ్యాయని, అబద్ధపు హామీలతో గెలిచిన చంద్రబాబు పేదలకు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ఈ సందర్భంగా "చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు" పోస్టర్ ను ఆవిష్కరించారు.