తణుకు, పశ్చిమ గోదావరిలో మహిళా ఉద్యమ నేత వంక నాగమణి మృతిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం, జిల్లా కార్యదర్శి జే. ఎన్.వి. గోపాలన్ తీవ్ర సంతాపం తెలిపారు. నాగమణి మహిళలు, పేదల సమస్యలపై పోరాడిన ధీశాలి అని, తన భర్త మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ అడుగుజాడల్లోనే ఉద్యమాల్లో పాల్గొన్నారని కొనియాడారు. ఆమె జీవిత సహచరిగా, ఉద్యమ సహచరిగా సఫలమయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు వంక నాగమణి కుమారుడు, ఎమ్మెల్సీ వంక రవీంద్రను కలిసి పరామర్శించారు.