సాంకేతికత పేరుతో కూలీల పొట్ట కొట్టొద్దు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రోజుకు రెండుసార్లు ఫోటో హాజరు తీసుకునే పద్ధతిని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. తణుకు మండలం తేతలి గ్రామంలో ఉపాధి కూలీలను సందర్శించిన సంఘం నేతలు అరటికట్ల రవి, బళ్ళ చిన వీరభద్రరావు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం సాంకేతికత పేరుతో ఫేస్ యాప్, రెండు పూటల హాజరు పెట్టి గ్రామీణ పేదల జీవనోపాధిపై దాడి చేస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి కూలీలంతా రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్