తణుకు హత్య లో వెలుగు చుసిన వాస్తవాలు

తణుకులో ఆరు నెలల క్రితం జరిగిన ఘర్షణకు సంబంధించిన పాత కక్షల నేపథ్యంలో యువకుడు ఎలీషా హత్యకు గురయ్యాడు. మే 31 రాత్రి ఎలీషా ఇంటి సమీపంలో జరిగిన ఈ ఘర్షణలో ఎలీషా మృతి చెందగా, అతని స్నేహితులు ఇద్దరికి గాయాలయ్యాయి. గతంలో బిర్యానీ పాయింట్ వద్ద జరిగిన గొడవలో ఎలీషాతో వాగ్వాదానికి దిగిన బొత్స లోకేష్, మల్లిపూడి శశి లు అప్పటి నుంచి కక్ష పెంచుకున్నారని సమాచారం. హత్య చేసిన నిందితులు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్